ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో `అదుర్స్`కి ప్రత్యేక స్థానం ఉంది. అందులో చారిగా ఎన్టీఆర్ నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ... ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. బ్రాహ్మణ కుర్రాడిగా ఎన్టీఆర్ నటన.. ఆ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు అలాంటి పాత్రలోనే పరకాయ ప్రవేశం చేయబోతున్నాడట నాని. నాని కథానాయకుడిగా `అంటే.. సుందరానికి` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో నాని బ్రాహ్మణ కుర్రాడిగా నటించబోతున్నాడట. ఈ సినిమాలో నాని పాత్ర.. అదుర్స్‌లోని చారి పాత్రని గుర్తుకు తెస్తుందని తెలుస్తోంది. ఓ బ్రాహ్మణ అబ్బాయికీ, క్రీష్టియన్ అమ్మాయికీ జరిగే లవ్ స్టోరీనే.. ఈ సినిమా కథ అని సమాచారం. `దువ్వాడ జగన్నాథమ్`లోనూ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగానే కనిపించాడు. అయితే.. అందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ. కాబట్టి..నాని పాత్రకు 100 శాతం ఎన్టీఆర్ పాత్రే రిఫరెన్స్‌గా ఉండొచ్చు.