ఈవారం విడుదలైన సినిమాల్లో `పాగల్` ఒకటి. పాగల్ తో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి.. వాటిలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్నది పాగల్ కే. విశ్వక్‌సేన్ - నివేదా పేతురాజ్ జంటగా నటించిన సినిమా ఇది. హిట్, ఫలక్ నామా దాస్, ఈ నగరానికి ఏమైంది లాంటి మంచి సినిమాలు చేసిన విశ్వక్ కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా నైజాంలో. అందుకే ఈ సినిమాకి ఊహించిన దానికంటే ఎక్కువ బిజినెస్ జరిగింది. థియేటరికల్ రైట్స్ దాదాపుగా 6.5 కోట్లకు అమ్ముడైనట్టు టాక్. శని, ఆదివారాలు వసూళ్లు కూడా ఓకే అనిపించుకున్నాయి. రెండు రోజులకు దాదాపు 3 కోట్ల వరకూ రాబట్టిందని సమాచారం.
కానీ ఇది సరిపోదు. బ్రేక్ ఈవెన్ కి చేరాలంటే ఈ సినిమా కనీసం 7 కోట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సీన్ కనిపించడం లేదు. పైగా ఈ సినిమాని నెగిటీవ్ రివ్యూలు వచ్చాయి. అవి మరింతగా... ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. ఈవారంలో రాజ రాజ చోర, కనబడుటలేదుతో పాటు మరో 4 సినిమాలు రాబోతున్నాయి. ఎన్ని వసూళ్లు తెచ్చుకున్నా,.... గురువారం లోపే. ఆ తరవాత.. కష్టం. ఎటు చూసినా పాగల్ తో బయ్యర్లు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ నష్టమెంత అనేది తెలియాలంటే మరో వారమైనా ఆగాలి.