సమంత ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టింది. సినిమాలకి దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ని ఫాన్స్ తో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంది. హెల్త్ పరంగా కోలుకుని, మంచి ఫిట్ గా తయారయ్యి మళ్ళీ ఇప్పడు రీఎంట్రీకి సిద్ధం అయ్యింది. వన్ ఇయర్ సినిమాలకి దూరంగా ఉన్నా సామ్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదని ఆమె అందుకున్న చాన్స్ లు చూస్తే తెలుస్తోంది. సామ్ సొంత నిర్మాణ సంస్థ స్థాపించి ఒక సినిమా అనౌన్స్ చేసింది. ఇందులో తానే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లు వుడ్ లలో అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా షారుఖ్ తో ఒక మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
ఒక వైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో అదిరిపోయే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. రాజ్ అండ్ డీకే నిర్మించిన ఈ సిరీస్ సమంతకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చి పెట్టింది. నెక్స్ట్ కూడా ఓటీటిలో సత్తా చాటేందుకు సామ్ వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతోంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా వస్తున్న 'హానీ బనీ' లో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఇది ఇంకా రిలీజ్ కాలేదు. నెక్స్ట్ ఫ్యామిలీ మెన్ 3 లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాక ఇప్పుడు ఇంకొక కొత్త సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సామ్.
ఈ కొత్త సిరీస్ ను కూడా రాజ్ అండ్ డీకే నిర్మిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ని ఎనౌన్స్ చేశారు. అంతే కాదు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. రక్తబీజ్ అనే వెరైటీ టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఆదిత్య రాయ్ కపూర్, సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. చాలా ఇంట్రస్టింగ్ కథాంశంతో తెరకెక్కనుండటంతో సామ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.