'విన్నర్‌'కి సెన్సార్‌ ఫుల్‌ సపోర్ట్‌

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'విన్నర్‌'. ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని తాజాగా సెన్సార్‌ సర్టిఫికేట్‌ అందుకుంది. ఏ కట్స్‌ లేకుండా ఈ సినిమాకి క్లీన్‌ యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తొలిసారిగా సాయి ధరమ్‌ తేజ్‌తో జత కడుతోంది ఈ సినిమాలో. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో తేజు బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. పాటల్లోని లొకేషన్లు చాలా రిచ్‌ లుక్‌నిస్తున్నాయి. అలాగే ఈ సినిమా ఆడియోను కూడా తేజు సరికొత్త రీతిలో విడుదల చేశాడు. ఒక్కో ఆడియో సింగిల్‌ ఒక్కో స్టార్‌తో విడుదల చేయించి, కొత్తగా క్రెడిట్‌ కొట్టేశాడు తేజు. తొలి సాంగ్‌ని సూపర్‌ స్టార్‌ మహేష్‌తోనూ, తర్వాత సమంత, అనిరుధ్‌, రవితేజలతో సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఆ పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో రకుల్‌ గ్లామర్‌ బాగా ఆకట్టుకుంటోంది. ఇంతవరకూ చేసిన సినిమాల కన్నా ఈ సినిమాల్లో రకుల్‌ మరింత అందంగా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాతో మరో ప్రత్యేకత కూడా ఉంది. బుల్లితెర ప్రముఖ యాంకర్‌గా చెలామణీ అవుతోన్న సుమ కనకాల ఈ సినిమాతో సింగర్‌గా అవతారమెత్తింది. సూయ సూయ.. అంటూ ఐటెం సాంగ్‌ని సుమ పాడింది. మరో యాంకర్‌ అనసూయ ఈ పాటకి నృత్యం చేసింది. అంటే స్పెషల్‌ సాంగ్‌ అన్నమాట. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS