సాయి ధరం తేజ్ రకుల్ ప్రీత్ జంటగా రాబోతున్న విన్నర్ సినిమాలోని పాటలను ప్రముఖ హీరోలచే విడుదల చేయిస్తూ సినిమాకి క్రేజ్ తెస్తున్నారు.
మొన్నటికి మొన్న సితార అనే పాటను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసాడు. ఇక రేపు మరొక పాటను ప్రముఖ హీరో ఒకరు రిలీజ్ చేయనున్నారని సినిమా యూనిట్ తెలుపుతుంది. “పిచ్చోడ్నే అయిపోయా” అనే పాట రేపు ఉదయం 11గంటలకు రిలీజ్ అవ్వనుంది.
మరి ఈ పాటను రిలీజ్ చేసే ఆ ప్రముఖ హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోస్ చేసిన సంగీతం మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక రేపటి పాట ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.