స్టార్ హీరోలకి అత్యుత్సాహం చూపే అభిమానుల నుండి ఇబ్బందులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ క్రమంలోనే నిన్న కింగ్ నాగార్జున కి ఈ తరహా అనుభవమే ఒకటి ఎదురైంది.
అయితే ఆ సమయంలో నాగార్జున అక్కడ లేకపోవడంతో ఆయన సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే- ఆదిలాబాద్ కి చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి సమయంలో ఆయన ఇంటివద్దకు చేరుకొని తాను వెంటనే నాగార్జునని కలవాలని అని గొడవే చేసింది.
ఆయనని కలవడానికి కారణమేంటి అని ఆరా తీయగా- తనకి నాగార్జున రూ 4 కోట్లు అప్పు ఉన్నాడు అని అది తీసుకునేందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పిందట. ఈ సమాధానంతో ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది ఆమెకి నచ్చజెప్పి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారట.
ఆమె ససేమిరా అనడంతో పోలీసులకి సమాచారం అందివ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఆమెని స్టేషన్ కి తరలించారు. ఆమెని పరిశీలించగా సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టుగా సమాచారం.