మెగా మనసుకి చిన్ని కృష్ణ సారీ!

మరిన్ని వార్తలు

చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’కి కథని అందించిన రైటర్ చిన్నికృష్ణ. చిరుకి క్షమాపణ చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. చిరుకి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసాడు చిన్నికృష్ణ. చిరుని కలిసి వచ్చిన తరువాత ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో గతంలో తాను చేసిన ఓ తప్పుకి ఇప్పుడు సిగ్గుపడుతున్నట్లు, పశ్చాతాపం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ చిన్నికృష్ణ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి “చిరంజీవికి ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ కథని ఇస్తే. కనీసం నాకు ఆకు వేసి అన్నం కూడా పెట్టలేదు. అంతేకాకుండా ఆ సినిమా క్రెడిట్ అంతా వాళ్లే తీసుకున్నారు” అంటూ, చిరంజీవిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. ఇప్పుడు ఆ  విషయాలపై స్పందిస్తూ, ఆ నాటి తన మాటలకి  పశ్చాత్తాప పడుతూ చిరంజీవికి క్షమాపణలు తెలిపారు చిన్ని కృష్ణ.


"చిరంజీవి అన్నయ్యకు పద్మవిభూషణ్‌ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఈ భూమి మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా ఇచ్చిన చిరంజీవిగారిని నాకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్న సమయంలో పేర్లు చెప్పను కానీ కొందరి ప్రభావం, ఒత్తిడి వల్ల అన్నయ్యపై పలు వ్యాఖ్యలు చేశాను. నోటికొచ్చినట్లు మాట్లాడాను. దాని వల్ల నా భార్య, బిడ్డలు, చెల్లి, బావ, సమాజం, నా మిత్రులు నన్ను భయంకరంగా తిట్టారు.ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా భగవంతుడి ముందు, స్నేహితుల ముందు క్షమాపణ కోరుతూనే ఉన్నాను.


ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా చిరంజీవిగారికి ఎదుటపడలేదు. ఆయనకు పద్మ విభూషణ్‌ వచ్చిందని విష్‌ చేయడానికి ఇంటికివెళ్తే ఆయన నన్ను రిసీవ్‌ చేసుకున్న విధానం, నా భార్యబిడ్డలు, వారి బాగోగులు గురించి ఆడిగిన తీరు చూసి నాలో నేనే బాధ పడ్డాను. ఇలాంటి వ్యక్తినా, నా నోటితో తప్పుగా మాట్లాడాను అని నా తప్పు తెల్సుకుని క్షమించమని అన్నయ్యను అడిగాను. పెద్ద మనసుతో క్షమించి, దగ్గరకు తీసుకుని కథలు ఏమన్నా రాస్తున్నావా చిన్ని? అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.అన్నయ్య మనసారా మాట్లాడటమే కాకుండా కలిసి పని చేద్దాం. మంచి కథ చూడు అని అన్నారు. ఈసారి ఆయనతో పని చేసే సినిమా దేశం గర్వించేలా ఉండాలని కోరుకుంటున్నాను జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అన్నయ్య అని ప్రాధేయపడ్డాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని వీడియోలో పేర్కొన్నారు చిన్నికృష్ణ. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS