తెలుగులో 'గౌరవం' సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ యామీ గౌతమ్. ఆ సినిమాతో పెద్దగా రిజిస్టర్ కాలేదు. కానీ తర్వాత నితిన్‌తో 'కొరియర్ బోయ్ కళ్యాణ్' సినిమాలో నటించింది. ఆ సినిమాతోనూ అమ్మడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు.
కానీ ఈ సినిమాలో గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి బానే మార్కులు పడ్డాయని చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హృతిక్ రోషన్‌తో 'కాబిల్' చిత్రంలో నటించింది. పర్‌ఫామెన్స్ పరంగా ఈ సినిమాతో వందకి వంద మార్కులు వేయించుకోవడంతో పాటు, సినిమా కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో తర్వాత సినిమాలు చేయలేదు. కానీ బాలీవుడ్‌లోనే ఫిక్స్ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలొలుకుతూ కనిపిస్తుంది.
తాజా ఫోటోలో పోల్ డాన్స్ చేస్తూ, కెమెరాకు పోజిచ్చిన యామీ గౌతమ్‌ని చూస్తున్నారుగా. ఇంతవరకూ పోల్ డాన్స్ అంటే గుర్తొచ్చేది హాట్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. కానీ పోల్‌పై యామీ చేస్తున్న ఫీట్స్ చూస్తుంటే, ఈమెను కూడా గుర్తుపెట్టుకోవాలి మరి. టూ పీస్ పొట్టి డ్రస్సులో యామీ పోల్ అందాలు కెవ్కు కేక పుట్టిస్తున్నాయిలే.