బెజవాడ పోరీ హిట్టు కొడుతుందా మరి.!

మరిన్ని వార్తలు

'ఎట్‌ నర్తనశాల' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ముద్దుగుమ్మ యామినీ భాస్కర్‌ ఇప్పుడు టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమాలోని 'పిచ్చి పిచ్చిగా నచ్చావురా..' వీడియో సాంగే అందుకు కారణం అని చెప్పొచ్చు. ఆ సాంగ్‌లో అమ్మడి హాట్‌ హాట్‌ అందాల ప్రదర్శనే అందరి నోటా ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. 

అయితే ఈ బ్యూటీకి ఇదేం తొలి చిత్రం కాదండోయ్‌. గతంలో 'కీచక' తదితర చిత్రాలలో నటించింది. అయితే పెద్దగా రిజిస్టర్‌ కాలేదు. 'కాటమరాయుడు' చిత్రంలోనూ ఈ బ్యూటీ నటించింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడి నుండో దిగుమతి కాలేదు. అసలు సిసలు పదహారణాల తెలుగమ్మాయి. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా విజయవాడలోనే. చిన్నతనం నుండీ సినిమాలపై ఆశక్తి ఉంది. ఆ ఆశక్తికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడై, ఇదిగో ఇంతవరకూ వచ్చింది. 

'నర్తనశాల' సినిమా యామినీ భాస్కర్‌కి మంచి గుర్తింపే తెచ్చి పెట్టేలా ఉంది. నాగశౌర్య హోమ్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్‌లో యామినీ భాస్కర్‌ జోరుగా పాల్గొంటోంది. ముఖ్యంగా ఆమె నటించిన ఆ వీడియో సాంగ్‌కే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. 

అనుకోకుండా ఈ బ్యూటీకి ఈ సినిమాలో ఆఫర్‌ దక్కిందట. ప్రాధాన్యత ఉన్న పాత్రే కాకుండా, కొన్ని చోట్ల కాస్త చేతి వాటం కూడా చూపించాల్సి వచ్చిందట. అంటే యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా నటించానని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. చెబుతోంది సరే, అమ్మడు తన టాలెంట్‌ ఎలా ప్రదర్శించిందో చూడాలంటే ఆగస్టు 31 వరకూ వేచి చూడాల్సిందే.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS