పదహారణాల పదునెక్కిన అందం

By iQlikMovies - October 04, 2018 - 17:45 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువన్న విమర్శ ఎప్పటినుంచో వుంది. సరైన అవకాశాలొస్తే, ముంబై ముద్దుగుమ్మలకు గట్టి పోటీ ఇచ్చే సత్తా తెలుగమ్మాయిలకు వుంది. ఇదిగో ఈ బ్యూటీని చూస్తే ఆ మాట నిజమన్పిస్తుంది. తెలుగులో యామినీ భాస్కర్‌ పలు సినిమాల్లో నటించింది. 'కాటమరాయుడు' సినిమాలో నటించించిందీ భామ. ఈ మధ్యనే 'నర్తనశాల' సినిమాలో యంగ్‌ హీరో నాగశౌర్య సరసన కూడా నటించింది.. బికినీ గ్లామర్‌తో మెప్పించే ప్రయత్నమూ చేసింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో యామినీ భాస్కర్‌ కాస్త డీలా పడింది. ఈసారెలాగైనా హిట్‌ కొడ్తానంటూ 'భలే మంచి చౌక బేరం' సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో థ్రిల్లర్‌ మూవీ. కామెడీ మిక్స్‌ చేసిన థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాతో యామినీ భాస్కర్‌ దశ తిరుగుతుందో లేదోగానీ, సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలా హాట్‌ అండ్‌ క్యూట్‌గా కన్పిస్తూ, తన గ్లామర్‌ సత్తా చాటి చెబుతోన్న ఈ బ్యూటీకి ముందు ముందు మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS