కెజిఎఫ్ 2 తర్వాత అతనితో చేస్తాడట!

మరిన్ని వార్తలు

'కెజిఎఫ్: చాప్టర్ 1' విజయంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు సాధించాడు కన్నడ స్టార్ హీరో యష్. అప్పటి నుంచి యష్ నెక్స్ట్ ప్రాజెక్టులపైన ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం యష్ 'కెజిఎఫ్: చాప్టర్ 2' లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా సీజన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల లోపే మరో కొత్త సినిమాకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.

 

ప్రశాంత్ నీల్ శిష్యుడు నార్తన్ కన్నడలో 'మఫ్టి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శివరాజ్ కుమార్ - శ్రీమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇదిలా ఉంటే నార్తన్ ఈమధ్యే యష్ కు ఒక కథ వినిపించి మెప్పించాడట. కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయ్యమని యష్ కోరాడట. ఈ సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు.

 

యష్ ఇప్పుడు భారీ క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఈ సినిమాను నిర్మించేందుకు చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారని సమాచారం. దసరా లోపే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS