దీపావళి నుండి మీడియం సినిమాల సందడే కనిపించింది. ఓదేవుడా ఓకే అనిపించినా మిగతా సినిమాల హడావిడి కనిపించలేదు. డబ్బింగ్ సినిమా సర్దార్ దీపావళి విజేతగా నిలిచింది. తర్వాత వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. గతవారం వచ్చిన సమంత యశోదకి కూడా ఓకే అనిపించింది. సమంత యాక్షన్ యశోదకి ప్రధాన ఆకర్షణ.
అయితే వారం మీడియం సినిమాలు కూడా లేవు. అన్ని చిన్న సినిమాలే. మసూద అనే హారర్ సినిమాతో పాటు సుడిగాలి సుదీర్ గాలోడు, అందరూ కొత్తవాళ్ళు కలసి చేసిన అలపిరికి అల్లంత దూరంలో, సీతారామపురంలో అనే ఓ చిన్న సినిమా విడుదలౌతున్నాయి. ఇందులో ఏ సినిమాకి పై కూడా ప్రామెసింగ్ బజ్ లేకపోవడం యశోద, ఊర్వశివో రాక్షసివోకి కలిసొచ్చే అంశం.