విశాల్ పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అభినయ అనే కథానాయికతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, తనని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలొచ్చాయి. దీనిపై స్పందించాడు విశాల్. ``నడిగర్ బిల్డింగ్ కట్టిన తరవాతే... నా పెళ్లి. ఎందుకంటే... అక్కడ సినీ నటులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్లకి సరైన వసతులు కూడా లేవు. అవన్నీ పరిష్కరించాకే నా పెళ్లి అని ఎప్పుడో చెప్పా. నేను మాట ఇచ్చానంటే నిలబెట్టుకొంటా. నడిగర్ బిల్డింగ్ కట్టాక నా పెళ్లి చేసుకొంటా. నా పెళ్లికి అందరినీ పిలుస్తా`` అని క్లారిటీ ఇచ్చాడు.
విశాల్ నటించిన `లాఠీ` ప్రీ రిలీజ్‌ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా స్టేజీపై విశాల్ మాట్లాడుతున్నప్పుడు యాంకకర్ `అభినయతో పెళ్లి` గురించి ప్రస్తావించినప్పుడు విశాల్ ఇలా బదులిచ్చాడు. అభినయతో ప్రేమ వ్యవహారం విషయంలో చెన్నై మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. అయినా విశాల్, అభినయ ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం విశాల్ బయటపడిపోయాడు.