సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం యశోద. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి బొటా బొటీ రివ్యూలు వచ్చాయి. సమంత నటన మాత్రం హైలెట్ అని, ట్విస్టు పోకిరి సినిమాని పోలి ఉందని విశ్లేషకులు చెప్పేశారు. వసూళ్లు కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. అయితే ఈ వీకెండ్ మరో సినిమా లేదు. యశోదకు పోటీ లేదు. సినిమాకి వెళ్లాలంటే యశోదనే ఆప్షన్.
అయితే నిర్మాతలకు మాత్రం యశోద సేఫ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.25 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఓటీటీ నుంచి దాదాపుగా రూ.15 కోట్లు వచ్చేసింది. శాటిలైట్ మరో రూ.5 కోట్లు వేసుకొన్నా.. డిజిటల్ నుంచి 20 కోట్లు రాబట్టినట్టే. ఈ సినిమాని నిర్మాత దాదాపుగా సొంతంగా విడుదల చేసుకొన్నాడు. అడ్వాన్సుల రూపంలో రూ.6 కోట్ల వరకూ వచ్చాయి.
ఈసినిమా బాక్సాఫీసు కనీసం రూ.10 కోట్ల వసూళ్లు అందుకొంటే... నిర్మాత లాభాలు ఆర్జిస్తాడు. లేదంటే... కనీసం పెట్టుబడి రాబట్టుకొంటాడు. ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు.కాబట్టి నిర్మాత మాత్రం సేఫే అనుకోవాలి.