తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమీషన్ నిబంధనల మేరకే పార్టీలు నచుడుకోవాల్సిన పరిస్థితి. ఈ ఎఫెక్ట్ `యాత్ర` సినిమాపై పడింది.
వైఎస్ఆర్ జీవిత చరిత్రని `యాత్ర` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ పడింది. షూటింగ్ సమయంలో కాంగ్రెస్ జెండాలు ఎక్కడా వాడకూడదన్న ఎన్నికల కమీషన్ నిబంధనతో.. షూటింగ్ విషయంలో సర్దుబాటు చేశారు. హైదరాబాద్ శివార్లలో చేయాల్సిన షూటింగ్‌కి అప్పటికప్పుడు వాయిదా వేసి... ఆంధ్ర బోర్డర్లో తెరకెక్కించాల్సివచ్చిందని సమాచారం.
కోదాడకి దగ్గర్లోని ఓ మారుమూల ప్రదేశంలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించాల్సివచ్చింది. డిసెంబరు 21న ఈ సినిమాని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల వ్యూహం. అప్పటికి తెలంగాణ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి.. విడుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
అయినా.. వైఎస్ఆర్ సినిమా ప్రభావం ఆంధ్ర ప్రదేశ్రాజకీయాలపై పడుతుంది తప్ప, తెలంగాణపై కాదు. మరి ఆ ప్రభావం ఎంతన్నది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసేవరకూ తెలీదు.