తన తనయుల సినిమా అనేసరికి అన్ని విషయాల్ని దగ్గరుండి చూసుకోవడం నాగార్జునకు అలవాటు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తీసిన సినిమాలే కాదు, బయటి సినిమా అయినా తన ఇన్‌వాల్వ్‌మెంట్ తప్పనిసరి. ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని మార్పులు చేర్పులూ చెప్పడం, రీషూట్లు చేయించడం, పబ్లిసిటీ విషయంలో సలహాలు ఇవ్వడం ఇవన్నీ నాగ్‌కి అలవాటే.
అయితే `సవ్యసాచి` విషయంలో మాత్రం ఆయన కలుగ జేసుకోలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కీ రాలేదు. `సవ్యసాచి రిపోర్ట్ ఆయనకు ముందే తెలుసు.. అందుకే ఆయన ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు` అని ఇండ్రస్ట్రీ వర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ఏమాత్రం మంచి టాక్ రాలేదు. మైత్రీ మూవీస్ సంస్థకి తొలి ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు సైతం డిక్లేర్ చేశాయి. గత నెల రోజుల వ్యవధిలో చైతూకి దక్కిన రెండో పరాజయం ఇది.
ఈమధ్యే ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని నాగ్ ఈ సినిమా చూశారని, అయితే మార్పులు చెప్పకుండా వెళ్లిపోయారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోజే నాగ్‌కి ఈ సినిమా ఫలితం విషయంలో ఓ క్లారిటీ వచ్చిందని, ఎన్ని మార్పులు చేసినా లాభం లేదనే నాగ్ జోక్యం చేసుకోలేకపోయారని చెబుతున్నారు.
అయితే ఈ సినిమా పట్టాలెక్కించే ముందే నాగ్‌కి కథ తెలుసు. చందూ మొండేటిపై నమ్మకంతో.. ఈసినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.