యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవలే ఆయన తన లవ్ డాక్టర్ తేజస్వినితో నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు కాబోయే లైఫ్ ఫాట్నర్ తేజస్వి నిఖిల్‌కి అప్పుడే అదృష్టం తెచ్చి పెట్టేసింది. వాయిదాల మీద వాయిదాలు పడి, అసలు విడుదలవుతుందో లేదో కూడా తెలియని 'అర్జున్ సురవరం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట పండించింది ఈ సినిమా. దాంతో నిఖిల్ కెరీర్‌కి కొత్త ఉత్సాహం అద్దినట్లయ్యింది.
ఆ ఉత్సాహంలోనే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాడట. కొత్త సంవత్సరంలో నిఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానున్నట్లు తాజా సమాచారం. మరోవైపు నిఖిల్ కెరీర్‌ని కూడా జెట్ స్పీడ్‌తో బిల్డప్ చేసుకుంటున్నాడు. 'అర్జున్ సురవరం' ఇచ్చిన జోష్‌తో నిఖిల్ సిద్దార్ద్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా వేగవంతం చేయాలనుకుంటున్నాడట. ఆల్రెడీ 'శ్వాస' అనే మూవీని లాంఛనంగా ప్రారంభించి పక్కన పెట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కార్తికేయ 2'కి స్క్రిప్టు పనులు వేగవంతం చేయిస్తున్నాడట. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు, సుకుమార్ రైటింగ్స్‌లో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమాని నిఖిల్ లైన్‌లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే.