ఉయ్యాలా జంపాలా' బ్యూటీ అవికా గోర్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్‌లో అలరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నటించిన ఒకటీ, రెండు చిత్రాల్లోనూ పద్థతిగానే కనిపించింది. పెద్దగా అందాల ఆరబోత జోలికి పోలేదు. కానీ, ఈ మధ్య మనసు మార్చుకుంది కాబోలు. అందాల ఆరబోతకు తెర లేపింది. హీరోయిన్‌గా రాణించాలంటే, అందాల వల తప్పదన్న నిజం గ్రహించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాని తన లేలేత అందాలతో హీటెక్కించేస్తోంది. అవికని అలా చూసిన కుర్రకారు ఈ పాప మన ఉమాదేవియేనా.? అని ఆశ్చర్యపోతున్నారు. బుల్లితెర ప్రేక్షకులు మన చిన్నారి పెళ్లి కూతురేంటీ.? ఇలా మారిపోయిందేంటీ.? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎలాగైతేనేం, వార్తల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది అవికాగోర్. ఆ అట్రాక్షన్‌తోనే కదా.. అవకాశాలు అంది పుచ్చుకునేది. మొత్తానికి అవికా సోషల్ మీడియా గ్లామర్ హంగామా బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. అసలెందుకింత హంగామా అంటే, ఇకపై వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో సెటిలైపోవాలనుకుంటోందట. అలా సెటిలవ్వాలంటే, తప్పదు కదా ఈ మాత్రం స్కిన్ షో చేయాలి మరి. ఓకే లెట్స్ కేరీ ఆన్ డియర్ చిన్నారి పెళ్లి కూతురు.