'బాహుబలి' సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రబాస్ గ్యాప్ తీసుకున్నాడు. బాహుబలితోనే దాదాపు ఐదేళ్లు వేరే సినిమా ఆలోచన లేకుండా, డార్లింగ్ ప్రబాస్ 'బాహుబలి'గా సింగిల్ మేకప్‌లో సెటిలైపోయాడు. ఎట్టకేలకు ఆ సినిమా సాధించిన ఘన కీర్తితో యూనివర్సల్ స్టార్ అని ట్యాగ్ సంపాదించాడు కానీ, ఆ స్థాయిలో ప్రబాస్ రేంజ్ పెరిగిపోయాక, తర్వాతి సినిమా లెవల్స్ కూడా అదే రేంజ్లో ఉండాలనే అభిమానులు ప్రబాస్ నుండి ఎక్స్పెక్ట్ చేయడంతో, మినిమమ్ బడ్జెట్ సినిమాగా అనుకన్న 'సాహో' కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపాంతరం చెందింది.
ఈ సంగతిటుంచితే, 'బాహుబలి'తో తీసుకున్న గ్యాప్‌ని కవర్ చేసేందుకు ప్రబాస్ పక్కాగా ప్రణాళికను రూపొందించేశాడట. ఓ పక్క 'సాహో'లో నటిస్తూనే, మరో పక్క 'జిల్' ఫేం రాధాక్రిష్ణతో సినిమా చేసేందుకు ఓకే అన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేది కాదులే అని లైట్ తీసుకునే టైం కాదిది. ఎందుకంటే, ఓ పక్క సాహో సెట్స్‌పై ఉండగానే, రాధాక్రిష్ణ సినిమా కూడా పట్టాలెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ప్రబాస్ నుండి సినిమా వచ్చే అవకాశాలు లేవు.
కానీ వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాలు కొద్ది గ్యాప్‌లో విడుదల చేసేలా ప్రబాస్ ప్లాన్ చేస్తున్నాడట. సో వచ్చే ఏడాది ప్రబాస్ అభిమానులకు పండగే పండగన్న మాట. ఈ కొత్త సినిమాలోనే ప్రబాస్‌తో పూజా హెగ్దే నటిస్తోంది. 'సాహో'లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.