ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ములాఖాత్ అవ్వాలని తెలుగు చిత్రసీమ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈరోజు... టాలీవుడ్ పెద్దలతో జగన్ భేటీ వేయనున్నారు. అయితే కరోనా నిబంధనల మేరకు.. ఈ సమావేశానికి కేవలం ఏడుగురు మాత్రమే రావాలని ఆదేశాలు అందాయి. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.
ఏపీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా సమస్యలున్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడాలి. దాంతో పాటుగా లాక్ డౌన్ సమయంలో థియేటర్ల కరెంటు ఛార్జీల విషయమై మినహాయింపులు అడగాలి. అన్నింటికంటే ముఖ్యంగా 100 శాతం ఆక్యుపెన్సీ కావాలి. వీటితో పాటు చాలాకాలంగా నంది అవార్డులు ఇవ్వడం లేదు. వీటిపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది.