సహజీవనం తప్పు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ మధ్యనే. వివాహేతర సంబంధాల్ని కూడా నేరంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించాల్సిన రాజకీయ నాయకులు, పార్టీలు మాత్రం.. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడానికి ఇంకా పాత చింతకాయ వ్యవహారాల్ని తెరపైకి తెస్తున్నాయి. సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కి ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడుసార్లు పెళ్ళయ్యింది.
మొదట నందిని అనే అమ్మాయిని పెళ్ళాడిన పవన్, ఆమె నుంచి విడిపోయాక, సహ నటి రేణుదేశాయ్‌ని వివాహమాడిన సంగతి తెల్సిందే. రేణుదేశాయ్‌తో కొన్నాళ్ళ సహజీవనం తర్వాత, ఆమెను పెళ్ళాడాడు పవన్. రేణుదేశాయ్‌తోనూ విడాకులు తీసుకున్న పవన్, ప్రస్తుతం అన్నా లెజ్‌నెవాతో వైవాహిక జీవితాన్ని పంచుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెసీ ఏమీ లేదు. అయినా ఓ వ్యక్తి, జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్ళి చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదిప్పుడు.
సినీ పరిశ్రమలో కావొచ్చు, రాజకీయాల్లో కావొచ్చు.. ఒకటికి మించిన వివాహాల్ని చూస్తూనే వున్నాం. చాటుమాటు వ్యవహారాల సంగతి సరే సరి. పవన్‌కళ్యాణ్ విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న 'పెళ్ళిళ్ళ ఆరోపణలు' రాజకీయంగా పవన్‌ని ఇరకాటంలో పడేయడంలేదు సరికదా, అటు తిరిగి ఇటు తిరిగి ఆ విమర్శలు వైఎస్సార్సీపీ ఇమేజ్‌ని తగ్గించేస్తున్నాయి.
పవన్‌కళ్యాణ్ పెళ్ళి గురించి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లోనే రచ్చ జరిగింది. ఆ సమయంలో రేణుదేశాయ్‌తో సహజీవనం చేశాడు పవన్. ఆ తర్వాత రేణుదేశాయ్‌ని పెళ్ళాడాడు. ఇప్పుడు మాత్రం, పవన్‌కి రాజకీయంగా ఆ విమర్శలు ఇబ్బందికరంగా లేవు. పరిస్థితులు మారాయి. అప్‌డేట్ అవ్వాల్సిన రాజకీయ ప్రత్యర్థులు, ఇంకా పాతకాలపు విమర్శలతో తమ ఇమేజ్‌ని చెడగొట్టుకుంటున్నట్లవుతోంది.