వదల బొమ్మాళీ నిన్నొదలా.. అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎవరా బొమ్మాళీ.? ఏంటా కథా అనుకుంటున్నారా.! చందమామ కాజల్ అగర్వాల్‌తో ఆల్రెడీ రెండు సినిమాల్లో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి కూడా జత కట్టనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ధృవీకరించింది. ఆల్రెడీ కాజల్, బెల్లంకొండ జంటగా 'కవచం' సినిమా పేక్షకుల ముందుకు వచ్చింది. తేజ డైరెక్షన్‌లో మరో సినిమా సెట్స్‌పై ఉంది.
ఇదిలా ఉంటే ఇదే పెయిర్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనీ కాజల్ మాటల ద్వారా అర్ధమవుతోంది. బెల్లంకొండతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి అని చందమామ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. గతంలో బెల్లంకొండ కూడా ఇంచుమించు ఇవే మాటలు చెప్పాడు. కాజల్‌తో పని చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది అని. అంటే ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కూడా కమిట్ అయ్యే ఉంటారనీ తెలుస్తోంది.
అయితే ఆ ప్రాజెక్ట్ వివరాలేంటో ప్రస్తుతానికి తెలియదు. కానీ త్వరలోనే కన్‌ఫామ్ చేయనున్నారట. ఇదో క్యూట్ లవ్ స్టోరీ అని మాత్రం తెలుస్తోంది. ఇకపోతే 'కవచం' సినిమాలో బెల్లంకొండ - కాజల్ పెయిర్‌పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ తరుణంలో రెండో సారే ఈ జంటను స్క్రీన్‌పై కష్టమనుకుంటే, మూడోసారి కూడానా.? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
చూడాలి మరి కాజల్ మాటల్లో నిజమెంతో.? తొలి సినిమా నుండీ సినిమా సినిమాకీ క్రేజీయెస్ట్ భామల్ని హీరోయిన్స్‌గా ఎంచుకునే యంగ్ హీరో బెల్లంకొండ ఎందుకిలా కమిట్ అయ్యాడో మరి.