వైఎస్ జగన్ పాత్రలో యంగ్ హీరో

మరిన్ని వార్తలు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ హవా నడుస్తున్నది. ఆ హవలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితాన్ని ఆధారం చేసుకుని 'యాత్ర' అనే బయోపిక్ రూపొందనుంది.

ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తాడు మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి అని వచ్చిన వార్తలని నిజం చేస్తూ ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్న మహి. వీ. రాఘవ్ ఈరోజు హీరో మమ్మూట్టి తో కలిసి దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు.

ఇదే సమయంలో ఇందులో వైఎస్ జగన్ పాత్రలో ఒక యంగ్ హీరో కనిపించనున్నాడు అని తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త. ఇప్పటికే దర్శక-నిర్మాతలు తెలుగులో ఉన్న యంగ్ హీరోలని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది, అయితే ఈ కథలో పొలిటికల్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఆ పాత్ర చేయడానికి వెనుకాడుతున్నట్టు తెలుస్తున్నది.

దీనితో ఈ బయోపిక్ కోసం వేరే రాష్ట్రం నుండి మరో హీరోని తీసుకొస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ సమయంలో వైఎస్ఆర్ బయోపిక్ లో తెలుగు హీరోలు కాకుండా వేరే చిత్రపరిశ్రమ హీరోలు కనపడే అవకాశాలే ఎక్కువ.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS