నటుడు, రచయత & దర్శకుడు అలాగే సంచలనాలకి కేంద్రబిందువుగా ఉండే పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఈ సారి ఆయన ఒక సినిమా వేడుకలో రాజకీయ ఉపన్యాసం చేసి అందరికి ఝలక్ ఇచ్చాడు.
ఆ వివరాల్లోకి వెళితే, పోసాని కృష్ణమురళి నిన్న జరిగిన MLA చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ- కళ్యాణ్ రామ్ చాలా నిజాయితీ పరుడు. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలోకి వస్తే చాలా మందికి ఉపాది దొరుకుతుంది అని అతను హీరో కావాలని కోరుకున్నాను. ఇక చాలా మంది హీరోలు అవుతారు, పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, అయి వాళ్ళకి వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు. దీనికి భిన్నంగా ఉంటారు హరికృష్ణ & కళ్యాణ్ రామ్. అందుకే కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకున్నాను.
ఇక ఈ చిత్రానికి MLA (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ పెట్టారు, కాని ఇది సినిమా వేడుక అయినా, అసందర్భం అయినా నాకిది మనస్పూర్తిగా చెప్పాలనిపించింది, నేన్ చెప్తా..
కళ్యాణ్ రామ్.. నువ్వు సినిమా పరంగా MLA (మంచి లక్షణాలున్న అబ్బాయి) అవ్వడం కంటే నిజంగా MLA అయితే నాకు ఇష్టం. ఎందుకంటే నువ్వు అయినా, మీ కుటుంబం అయినా రాజకీయాల్లోకి రావాలని ఎందుకంటాను అంటే.. “ తెలుగుదేశం మీది.. తెలుగుదేశం మీది.. నువ్వస్తే రామారావు గారి కుటుంబం నుంచి.. ప్రజలు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది.. థాంక్ యు..
ఇక ఈ మొత్తం ప్రసంగంలో కొసమెరుపు ఏంటంటే- పోసాని మాట్లాడుతూ- పొరపాటున కళ్యాణ్ రామ్ అనబోయి పవన్ కళ్యాణ్ అని అనడంతో అందరు షాక్ అయ్యారు..