ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇద్దరు హీరోలు- నాగ చైతన్య & అల్లరి నరేష్ తమ చిత్రాలు యుద్ధం శరణం & మేడ మీద అబ్బాయి వచ్చారు.
మొదట యుద్ధం శరణం విషయానికి వస్తే, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో హిట్ బాట పట్టిన చైతు చేసిన తరువాత చిత్రం ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైన పడింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక అందరు దీనిని చైతు నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని పోలి ఉందంటూ కామెంట్స్ చేశారు.
కాకపోతే ఇటువంటి కామెంట్స్ కామన్ అనుకోని వెళ్ళిన ప్రేక్షకులకి మాత్రం ఆ కామెంట్ కొంతవరకు నిజమే అని తెలిసిపోయింది. అయితే పోయిన యేడాదే SSS చిత్రం చేయడం అంతలోనే మళ్ళీ ఒకసారిఅదే తరహ చిత్రం చేయడం ఆయన అభిమానులకి,ప్రేక్షకులకి అంతగా రుచించలేదు. రొటీన్ గా ఫీల్ అవ్వడంతో ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ చేసిన తాజా ప్రయత్నం- మేడ మీద అబ్బాయి. మలయాళంలో విజయవంతమైన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రానికి రీమేక్ గా వచ్చిన మేడ మీద అబ్బాయి మన ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో ఒకరకంగా ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. ప్రేక్షకులు కూడా హైపర్ ఆది కామెడీ ని ధియేటర్ లో అందరు ఎంజాయ్ చేస్తుండగా మొత్తంగా చిత్రం మాత్రం ఎందుకో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీనితో మంచి హిట్ కోసం అల్లరి నరేష్ ఎదురుచూపులు కొనసాగనున్నాయి.
చివరగా.. ఈ వారం వచ్చిన రెండు చిత్రాలు యావరేజ్ గా నిలవడం, కలెక్షన్స్ కూడా ఒక మాదిరిగానే ఉండడంతో ఈ వారం యావరేజ్ గా ముగిసిపోనుంది.