బద్రి చిత్రంతో నటీగా అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాకుండా ఆయన జీవితంలోనే భాగంగా మారిపోయింది. ఇక దాదాపు ఒక దశాబ్దం తరువాత తమ బంధం నుండి విడిపోయి ఇప్పుడు స్నేహితులుగా గడుపుతున్నారు.
అయితే పవన్ తో కలిసి ఉన్న కాలంలో ఆయన కెరీర్ విషయానికి సంబందించిన అన్ని పనులు చూసుకుంటూ బిజీగా గడిపిన రేణు, పవన్ నుండి విడిపోయాక తను సొంతగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఒక చిత్రాన్ని కూడా నిర్మించింది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతు ఉంటుంది. అయితే ఇప్పుడు నటీగా, నిర్మాతగా కాకుండా మరొక కొత్త పాత్రలో రేణు కనిపించనున్నారట.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం, రేణు త్వరలోనే ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా చేయనున్నారట. అది కూడా ఒక ప్రముఖ ఛానల్ లో చేయబోతుండడం విశేషం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.