సినిమా, రాజకీయ రంగాల్లో వారసత్వం సర్వ సాధారణం అయిపొయింది. ఏ బాషా ఇండస్ట్రీ అయినా వారసులు ఎంట్రీ ఉంటోంది. టాలీవుడ్ లో పేరున్న పెద్ద ఫ్యామిలీస్ నందమూరి, మెగా, దగ్గు బాటి, అక్కినేని వంశాల వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నందమూరి వంశం నుంచి ఇంకొక వారసుడు హీరోగా ప్రస్థానం ప్రారంభించనున్నాడు. రామారావు వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, సినిమాల్లో రాణించారు. తరవాత ఎన్టీఆర్ మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక్ రత్నలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా, యాంగ్ టైగర్ ఒకరే తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు. నందమూరి వంశం నుంచి నాలుగో తరానికి చెందిన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కంటే ముందే ఇంకొక వారసుడు హీరోగా రానున్నాడు.
ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణకు ముగ్గురు కొడుకులు. జానకి రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. పెద్ద కొడుకు జానకిరామ్ టాలీవుడ్ లో నిర్మాణ రంగంలో ఉండేవారు. 2014 లో ఒక ఆక్సిడెంట్ లో జానకి రామ్ కనుమూశారు. ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం . అదీ నందమూరి వీర విధేయుడు, అభిమాని అయిన వై.వి.ఎస్.చౌదరి చేతుల మీదుగా అని, ఈ బాధ్యతను ఆయన చాలా ఆనందంగా స్వీకరించినట్లు తెలుస్తోంది.
నందమూరి ఫ్యామిలీ కి వై.వి.ఎస్.చౌదరికి ఉన్న అనుబంధం కారణంగా, హరికృష్ణని హీరోగా చౌదరినే పరిచయం చేసాడు. హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, సీతారామరాజు’, లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు YVS . ఈ మధ్య వరస పరాజయాలతో సినిమాలకి దూరంగా ఉన్న ఈయన మళ్ళీ ఇన్నాళ్ళకి జానకిరామ్ పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని టాక్. ఈ మూవీ తో వైవిఎస్ కామ్ బ్యాక్ అవుతారేమో చూడాలి.