నేను చనిపోవాలనుకున్నా: ప్రముఖ నటి

By iQlikMovies - May 11, 2018 - 18:57 PM IST

మరిన్ని వార్తలు

దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వసీం. ఉన్నట్టుండి ఈ నటి తాను చనిపోవాలి అని అనుకున్నట్టుగా తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు బాలీవుడ్ లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఆ వివరాల్లోకి వెళితే, అందరూ 25 ఏళ్ళు దాటిన వారికే డిప్రెషన్ వస్తుంది అన్న అపోహని నమ్మకండి. నా విషయానికి వస్తే, నేను దాదాపు నాలుగు నుండి అయుదు ఏళ్ళ వరకు తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అర్దరాత్రి పూట ఒక్కసారిగా మెలుకువ రావడం దానితో ఇష్టానుసారంగా తిండి కూడా తినేసి చాలా లావు కూడా అయినట్టు తెలిపింది. ఆ టైంలో తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలి అని కూడా అనిపించేదట.

అయితే దాదాపు ఒక అయిదేళ్ళ డాక్టర్లు ఇచ్చిన నాణ్యమైన చికిత్స ఇవ్వడంతో తాను బయటపడినట్టు చెప్పుకొచ్చింది.  ఇక ఈ విషయాన్నీ తన అభిమానులతో పంచుకోవాలని ఎప్పటినుండో అనుకున్నదట అయితే ఇన్నిరోజులకి ఆ అవకాశం వచ్చినట్టుగా చెప్పింది.

ఏదేమైనా ఈ మొత్తం విషయం అందరి దృష్టి ఆమె వైపు పడేలా చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS