రేప్ చేస్తామంటూ విలేకరికి ఫ్యాన్స్ హెచ్చరికలు

By iQlikMovies - May 11, 2018 - 18:48 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో అభిమానం పేరుతో కొందరు ఫ్యాన్స్ లా కాకుండా ఫ్యానటిక్స్ లా మారిపోతున్నారు. తమ అభిమాన హీరో నచ్చలేదు అని ఎవరైనా చెబితే.. వారిని తిట్టడం, బెదిరించడం వీలైతే శారీరకంగా దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తనకి అంతగా నచ్చలేదు అని చెప్పిన ఒక మహిళ జర్నలిస్ట్ పైన బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనకి ఈ చిత్రం బోర్ కొట్టింది అని చెప్పగా.. వెంటనే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అలాగే నేరుగా ఆమెకే ఫోన్ చేసి చంపేస్తాము, రేప్ చేస్తాము అంటూ బెదిరిస్తున్నారట.

ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. తనకి సినిమా నచ్చలేదు కాబట్టే అలా చెప్పను అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా బెదిరింపులకి పాల్పడుతునట్టు తెలిపింది.

ఏదేమైనా ఈ వికృత సంస్కృతి రానురాను మరింతగా పెచ్చుమీరుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS