తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్కార్'. దీపావళి సందర్భంగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ - విజయ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం కావడంతో భారీగా అంచనాలున్నాయి ఈ సినిమాపై. తమిళంతో పాటు తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది విజయ్‌కి. అందుకే తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ అదరగొట్టేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 750 ధియేటర్స్‌లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా 3500 ధియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. అయితే దీపావళికి విడుదలవుతున్న కారణంగా పండగ రోజు 'సర్కార్' మూవీ ఎక్స్‌ట్రా షోలు ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే ఈ విషయమై మరో చిన్న సమస్య నెలకొనడంతో కోర్టు ఈ ఎక్స్‌ట్రా షోస్‌పై నిషేధం విధించింది. దాంతో అభిమానులు కాస్త నిరాశకు గురయినప్పటికీ, విజయ్ - మురుగదాస్ కాంబోకి ఉన్న క్రేజ్‌తో సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు.
ఇకపోతే సినిమా కథ విషయానికి వస్తే, పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విదేశాల్లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓగా పని చేసే విజయ్‌కి ఇండియాలోని రాజకీయాలతో ఏంటి సంబంధం.? అనే విషయాన్ని ఆశక్తిగా ఈ సినిమాలో చూపించారు. కీర్తిసురేష్, వరలక్ష్మీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇకపోతే ఈ సినిమా కథ విషయమై తలెత్తిన వివాదం కామ్‌అప్ అయిపోయిన సంగతి తెలిసిందే. కథ తనదే అని కోర్టుకెక్కిన వరుణ్ పేరును టైటిల్స్‌లో వేయడానికి చిత్ర యూనిట్ ఒప్పుకోవడంతో గొడవ దాదాపు సర్దుమనిగిపోయింది.
దీపావళికి తన కథను విజయ్‌కి బహుమతిగా ఇస్తున్నట్లు తాజాగా రైటర్ వరుణ్ రాజేంద్రన్ పేర్కొన్నారు.