'రాజుగాడు' తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్ర ప్రసాద్, సితార, సుబ్బరాజ్, పృథ్వీ, కృష్ణ భగవాన్ తదితరులు.
నిర్మాణ సంస్థ: AK ఎంటర్టైన్మెంట్స్
మూల కథ: మారుతీ
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: రాజశేఖర్
ఎడిటర్: MR వర్మ
మాటలు: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
కథనం-దర్శకత్వం: సంజనా రెడ్డి 

రేటింగ్: 2.25/5

దర్శకుడు మారుతి వల్ల ఏదో ఒక వ్యాధి ఉన్న హీరో కూడా చలామణి అయిపోవచ్చు అని ఆయన గత రెండు చిత్రాలు- భలే భలే మగాడివోయ్ & మహానుభావుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపించి మరి నిరూపించాయి. ఇక ఇప్పుడు ఆయన అందించిన ఒక ఐడియా (అదే వ్యాధి) తో సంజనా రెడ్డి (కొత్త దర్శకురాలు)-రాజు తరుణ్ లు కలిసిరాజుగాడు అనే చిత్రాన్ని తీశారు. మరి ఈ చిత్రం పైన చెప్పిన రెండు చిత్రాల మాదిరిగా హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం..

కథ:

రాజు (రాజ్ తరుణ్) పుట్టుకతోనే క్లేప్టోమేనియా అనే ఒక వ్యాధి బారినపదతాడు. ఇది ప్రాణాంతకమైనది కాని ఈ వ్యాధి వల్ల తనకి తెలియకుండానే లేదా తనని తాను అదుపు చేసుకోలేక దొంగతనాలు చేస్తుంటాడు. ఈ వ్యాధికి మందు లేకపోవడంతో రాజు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు, దీని వల్ల ఒక అమ్మాయి ప్రేమని సైతం పోగొట్టుకుంటాడు.

ఈ తరుణంలో తన్వి (అమైరా దస్తూర్) తో పరిచయం అవ్వడం ఆమెతో ప్రేమలో పడడం జరుగుతుంది. అయితే తన వ్యాధి సంగతి ఆమె దగ్గర దాచిపెడతాడు. మరి ఈ విషయాన్నీ ఆమె దగ్గర ఎన్ని రోజులు దాచిపెట్టాడు? ఆమెకి ఈ వ్యాధి తెలియకుండా ఉంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది..

నటీనటుల పనితీరు:

రాజ్ తరుణ్: ఎప్పటిలానే చలాకీగా నటించాడు. ముఖ్యంగా దొంగతనం చేసి దొరికిపోయే సన్నివేశాల్లో హావభావాలు బాగా పలికించాడు.

 

అమైరా దస్తూర్: అమైరా నటనకి పెద్దగా అవకాశం లేదు. పాటలు, గుప్పెడ్డన్ని సన్నివేశాలలో ఆమె కనిపిస్తుంది. గ్లామర్ పరంగా అయితే ఈ సినిమాకి తను ప్లస్ అనే చెప్పాలి.

రాజేంద్రప్రసాద్ & సితార: ఈ ఇద్దరు సీనియర్ నటులు బాగా చేశారు. హీరోతో పాటు సినిమా మొత్తం వీరు ఉంటూ ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశారు..

సుబ్బరాజు, కృష్ణభగవాన్, రావు రమేష్, పృథ్వీలు అక్కడక్కడ మెరిసారు.

విశ్లేషణ:

ఈ చిత్రానికి మూల కథ మారుతీ అందించినా, కథనం మాత్రం సంజనా రెడ్డి రాసుకున్నారు. ఇక ఆమె కొత్త దర్శకురాలు అవ్వడంతో కథనం నడిపే తీరులో ఆమె చాల చోట్ల తడబడ్డారు. హీరోకి వ్యాధి పెట్టడం తెలికనే, కాని ఆ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందులు, అదే సమయంలో దాని వల్ల పండే హాస్యంలో పట్టులేకపోతే కథ మొత్తం దారి తప్పుతుంది.

ఈ సినిమా విషయంలో అదే జరిగింది. సినిమా కోసం తీసుకున్న పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికి, అది నడిపించే తీరులో చాలా లోపాలు కనిపించాయి. సన్నివేశాల్లో బలం లేకపోవడం, కొన్ని లజిక్స్ కి దూరంగా ఉండడంతో ఈ సినిమాకి ప్రేక్షకులని దూరం చేసింది.
సినిమా కథనం పైన ఇంకాస్త కృషి చేసుంటే, సినిమా రిజల్ట్ మారే అవకాశం ఉండేది.

సాంకేతిక వర్గం:

గోపిసుందర్ పాటలు వినడానికి బాగానే ఉన్నా, ఒక్కపాట కూడా గుర్తుపెట్టుకునేలా లేవు. ఛాయాగ్రహణం బాగుంది, నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

బలాలు:

+ రాజ్ తరుణ్
+ రాజేంద్రప్రసాద్ హాస్యం

బలహీనతలు:

- కథనం
- సెకండ్ హాఫ్
- క్లైమాక్స్

ఆఖరి మాట: రాజుగాడు- పెద్దగా నచ్చలేదు..

రివ్యూ రాసింది సందీప్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS