అత్తారింటికి దారేది ఫార్ములానే నమ్ముకున్న పవన్-త్రివిక్రమ్

మరిన్ని వార్తలు

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి అభిమానుల్లో ఎప్పుడు ఒక హైప్ ఉంటుంది. ఇక దానిని దృష్టిలో పెట్టుకొని తమ సినిమాలని ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంచడానికే ఈ ఇద్దరు ప్రయత్నిస్తుంటారు.

ఇక ప్రస్తుతం వీరు ఇద్దరు చేస్తున్న చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నది. అయితే తెలియవస్తున్న వార్తల ప్రకారం, ఈ చిత్ర క్లైమక్స్ అత్తారింటికి దారేది చిత్రంలో వచ్చే క్లైమాక్స్ మాదిరిగా సెంటిమెంట్ టచ్ లో ఉండే విధంగా ఉండనుందట.

ఇప్పటికి అత్తారింటికి దారేది క్లైమాక్స్ గురించి అభిమానులు చెప్పుకుంటుంటారు అలాంటిది మళ్ళీ అదే స్టైల్ లో క్లైమాక్స్ ప్లాన్ చేయడంతో ఈ చిత్రం పై కూడా అంచనాలు డబల్ అయిపోయాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS