రూ 1000 కోట్లని ముద్దాడిన బాహుబలి2!

మరిన్ని వార్తలు

బాహుబలి 2 కలెక్షన్స్ లో ఒక చరిత్ర సృష్టిస్తూ దూసుకపోతున్న సందర్భంలో ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి సాధ్యం కాని అద్భుతమైన రికార్డుని బాహుబలి 2 సొంతం చేసుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం, బాహుబలి 2 చిత్రం రూ 1000 కోట్ల గ్రాసు వసూళ్ళని సాదించింది. దీనితో అందరు ఊహించినట్టుగానే రూ 1000 కోట్ల మార్కుని టచ్ చేసి ఆ పైన కొత్త రికార్డుని సృష్టించే క్రమంలో దూసుకపోతుంది.

ఈ సందర్భంగా రాజమౌళి & బాహుబలి టీం పై అందరు ప్రశంసల కురిపిస్తున్నారు. బాహుబలి సిరీస్ భారతదేశ చిత్ర పరిశ్రమ గమనాన్ని మార్చింది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

మొత్తానికి రూ 1000 కోట్ల మార్కుని ముద్దాడిన తోలి చిత్రంగా బాహుబలి 2 కొత్త చరిత్రకి తెరదీసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS