'శతమానం భవతి'లో స్టార్‌ హీరోలంతా

By iQlik Movies - January 11, 2017 - 05:39 AM IST

మరిన్ని వార్తలు

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'శతమానం భవతి' సినిమాను దిల్‌ రాజు రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పెద్ద సినిమాలైన 'ఖైదీనెంబర్‌ 150', గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలతో పోటీగా ఈ సినిమా కూడా విడుదలవుతోంది. ఇద్దరు స్టార్‌ హీరోలకు పోటీగా చిన్న సినిమా అయిన ఈ సినిమాని ధైర్యంగా విడుదల చేస్తున్నాడంటేనే ఈ సినిమాపై దిల్‌ రాజుకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది. సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శర్వానంద్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. సినిమా ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా కనిపించనున్నారట. అది ఎలా అంటే స్టార్‌ హీరోలు అంతా లైవ్‌గా తెరపై కనిపించరు కానీ, ఆయా స్టార్‌ హీరోల సినిమాల్లోని కొన్ని సీన్స్‌ని అతికించి, కంటిన్యూటీ ఉండేలా ఓ సీన్‌ తీశారట. ఈ సీన్‌ సినిమాలో చాలా బాగా వచ్చిందట. ఇలాంటి సర్‌ప్రైజులు ఈ సినిమాలో మరికొన్ని ఉన్నాయంటోంది చిత్ర యూనిట్‌. మొత్తానికి ఏదో స్పెషాలిటీ లేకపోతే ఈ సినిమాపై దిల్‌ రాజు ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండడు. అయినా కథా నేపధ్యం కూడా బలంగా ఉండడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలివగలిగే అర్హత ఉన్న సినిమా అయ్యింది. అంతేకాదు శర్వానంద్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. గతేడాది కూడా ఇలాగే సైలెంట్‌గా రేసులో ఎంట్రీ ఇచ్చి,, గట్టి పోటీ ఇచ్చి సక్సెస్‌తో బయటికొచ్చాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now