యాక్సిడెంట్ కి గురైన గౌతం మీనన్

మరిన్ని వార్తలు

ఈరోజు తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ తృటిలో తప్పించుకున్నాడు.

అందుతున్న వివరాల ప్రకారం, మహాబలిపురం నుండి చెన్నై వస్తుండగా ఒక సిగ్నల్ వద్ద టిప్పర్ లారీ గౌతం మీనన్ ప్రయాణిస్తున్న కారుని డీకొంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ద్వంసమైంది, అదృష్టవశాత్తు దర్శకుడు గౌతంకి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

కేవలం కొన్ని స్వల్ప గాయాలతోనే భయటపడ్డట్టు తెలుస్తున్నది. తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో జరగడంతో నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

ఏదైతేనేమి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు దర్శకుడు గౌతం మీనన్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS