ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- జయ జానకి నాయక, లై & నేనే రాజు నేనే మంత్రి

మరిన్ని వార్తలు

ఈ వారం తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కి పెద్ద గిరాకీ వచ్చిందనే చెప్పాలి. వరుసగా నాలుగు రోజుల సెలవు రావడంతో ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వదులుకునేందుకు వెనకాడడంతో మూడు చిత్రాలు ఒకేరోజు విడుదల అయ్యాయి.

దీనివల్ల ప్రతి చిత్రానికి ఎంతోకొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న పరిస్థితుల నేపధ్యంలో ఈ మూడు చిత్రాలు ఎలా ఆడుతున్నాయో అనేదాని పై ఒకసారి మాట్లాడుకుందాం.

ముందుగా ఈ మూడింటిలో పెద్ద హైప్ తో విడుదలైన రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి గురించి చెప్పుకుందాం. చాలా కాలం తరువాత టాలెంటెడ్ తేజ నుండి అందరికి ఆసక్తి రేపే చిత్రం రానుంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉండింది. దీనిని నిలబెట్టుకుంటూ, తేజ ఈ చిత్రాన్ని నడిపించిన తీరుకి అందరు ఫ్లాట్ అయ్యారు, దీనికి తోడుగా రానా, కాజల్, కేథరిన్ ల నటన ఈ చిత్రాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళాయి. వీటన్నిటిని అందంగా కవర్ చేస్తూ లక్ష్మి భూపాల్ రాసిన సంబాషణలు ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్ర కలెక్షన్స్ కూడా రానా సోలో హీరోగా వచ్చిన అన్ని చిత్రాలకన్నా ఎక్కువ కావడంతో కమర్షియల్ గా కూడా నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ కొట్టేసింది అని చెప్పొచ్చు.

ఇక ఈ మూడింటిలో రెండవ వరుసలో ఉన్న జయ జానకి నాయక చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా ఈ బరిలో నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు పైనే ఆధారపడి విడుదలైంది ఈ చిత్రం. బోయపాటి ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యాడు, ఒక కమర్షియల్ చిత్రాన్ని ఎలా మలచాలో అన్న విషయంలో ఈయన పట్టు సాధించినట్టే కనిపిస్తున్నది. అనుభవం, హైప్ పెద్దగా లేని కొత్త హీరోని పెట్టుకుని కూడా బోయపాటి స్క్రీన్ పై మ్యాజిక్ చేసాడు. రకుల్ ప్రీత్ ఉండడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి కూడా కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్ దక్కింది అని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ మూడు చిత్రాలలో సైలెంట్ గా వచ్చి తన స్టామినా ఏంటో చూపెట్టింది నితిన్ నటించిన ‘లై’. ఈ సినిమా పైన మిగతా వాటితో పోల్చుకుంటే అంచనాలు లేవు అలాగే ప్రమోషన్లు కూడా అంతగా లేవు. అయితేనేమి ‘లై’ చిత్రంలో థ్రిల్లింగ్ గా సాగే కథనం ప్రేక్షకులని కట్టిపడేస్తున్నది. అలనాటి హీరో ఇప్పటి విలన్ అయిన అర్జున్ తో దర్శకుడు హను పలికించిన అభినయం ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక హీరో నితిన్ ఈ కథలో ఓదిగిపోయిన తీరు అధ్బుతం ఇక హీరోయిన్ మేఘా ఆకాష్ నటన కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది.కలెక్షన్స్ పరంగా కొద్దిగా యావరేజ్ గా మొదలయిన రెండవ రోజు కలెక్షన్స్ పెరగడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.

మొత్తానికి ఈ వారం విడుదలైన మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి చెప్పొచ్చు. ఇక ఈ మూడు చిత్రాలకి కలెక్షన్స్ రావాలని కోరుకుందాం...
   

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS