అమెరికానే ‘ఫిదా’ చేసేసిన ఫిదా

మరిన్ని వార్తలు

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసిన శేఖర్ కమ్ముల తనకి బాగా కలిసివచ్చే అమెరికాలో తన సత్తా ఏంటో ఈ చిత్రంతో చూపించాడు.

 

ఈ చిత్రం ఇప్పుడు 2 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన చిత్రాల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఈ ఘనత సాధించడంతో తన పెదనాన్న పక్కనే నిలబడే అవకాశం కొట్టేసాడు వరుణ్. మెగా హీరోస్ లో ఈ ఇద్దరు మాత్రమే ఇప్పటికి అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో తమ చిత్రాలతో నిలబడ్డారు.

ప్రస్తుతం ఈ లిస్టు లో 7వ స్థానంలో ఉన్న ఫిదా, ముందుముందు ఎంతవరకు వెళ్ళనుందో ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మూడు వారాల తరువాత కూడా హౌస్ ఫుల్స్ అవుతుండడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS