ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- శమంతకమణి & పటేల్ సర్

మరిన్ని వార్తలు

ఈ వారం తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెండు చిత్రాలు వచ్చాయి.

అందులో ఒకటి- నలుగురు హీరోలు కలిసి చేసిన శమంతకమణి. సందీప్ కిషన్, ఆది, సుదీర్ బాబు & నారా రోహిత్ లు కలిసి చేసిన ఈ థ్రిల్లర్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన రెండవ చిత్రంలో కూడా ఒక వైవిధ్యమైన కథనే ఎంచుకున్నాడు. అయితే ఆ కథని నడిపించిన తీరులో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అనే టాక్ వినపడింది. రాజేంద్ర ప్రసాద్, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ చిత్రానికి అదనపు ప్లస్ అని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.  

ఇక ఈ వారం వచ్చిన రెండవ సినిమా- పటేల్ సర్. జగపతి బాబునే నమ్ముకునిరాసిన కథకి 100% న్యాయం చేశాడని సినిమా చూసిన ప్రతిఒక్కరు ఒప్పుకున్న మాట. ఇక ఈ చిత్రం కోసం ఆయన మేక్ ఓవర్ కూడా ప్లస్ గా మారింది.

ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం వారు నిర్మించడం అలాగే ఈ సినిమాని పరోక్షంగా దర్శకుడు రాజమౌళి తన ట్వీట్స్ ద్వారా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకి కావాల్సిన హైప్ వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేరకు నిలబడనుందో అనే విషయం రేపటి కల్లా తెలిసిపోతుంది.

ఈ వారం వచ్చిన రెండు చిన్న బడ్జెట్ సినిమాలు అవ్వడం వల్ల ఈ చిత్రాల భవితవ్యం కలెక్షన్స్ పైన ఆధారపదనున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS