ఎన్టీయార్‌ చిలిపి చేష్టలు సూపర్‌ బాసూ!

మరిన్ని వార్తలు

'బిగ్‌బాస్‌' ప్రమోషన్‌ కోసం ఎన్టీయార్‌ భలే చిలిపి పనులు చేస్తున్నాడు. ప్రమోషన్స్‌ని చాలా కొత్తగా డిజైన్‌ చేశారు. ఓ హోల్‌లోంచి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఏం చేస్తున్నారో చూస్తున్నట్లు ఓ ప్రోమో ఇప్పటికే వచ్చింది. ఆ ప్రోమోకి పెద్దలు భలే ఉంందే అనుకుంటుంటే, చిన్న పిల్లలు భలే ఎంజాయ్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ అల్మరా కింద నుంచి పైకి లేస్తూ, పరిసరాల్ని గమనించే ఎన్టీయార్‌ ప్రోమో బిగ్‌ బాస్‌ షోపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ ప్రోమోస్‌ని చాలానే రిలీజ్‌ చేస్తారట. బిగ్‌బాస్‌ అంటేనే కొంటెతనం. ఆ విషయాన్ని ఫస్ట్‌ లుక్‌ ఫొటోతోనే చెప్పేశారు. ఆ తర్వాత వచ్చే ప్రోమోస్‌ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఈ షో స్టార్ట్‌ అవడానికి కౌంట్‌డౌన్‌ అయితే మొదలయ్యింది. ఈ నెల 16 నుండి ఈ షో ప్రసారం కానుంది. బుల్లితెరకే పెద్ద షోగా ఈ షో నిలవనుందని అంచనాలు వేస్తున్నారు. బుల్లితెరకి చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో ద్వారా ఎప్పుడో స్టార్‌డమ్‌ వచ్చేసింది. ఆ స్టార్‌డమ్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో కంటిన్యూ కానుంది. ఆల్రెడీ ఇప్పటికే రానాలాంటి హీరోలు, చాలా మంది ముద్దుగుమ్మలు బుల్లితెరను ఏలేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' బుల్లితెరపై బిగ్‌ సందడినే తెచ్చి పెట్టనుంది. ఏదేమైనా ఎన్టీఆర్‌ అంతటి స్టార్‌డమ్‌ ఉన్న హీరో ఈ తరహా చిలిపి సన్నివేశాలతో అభిమానుల్ని అలరిస్తోంటే ఆ కిక్కే వేరప్పా. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS