డ్రగ్స్ తో నాకెటువంటి సంబంధం లేదు: నందు

మరిన్ని వార్తలు

టాలీవుడ్ పైన డ్రగ్స్ మరకలు పడ్డాయి. నేటి ఉదయం నుండి టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల పేర్లు బయటకి వస్తున్న తరుణంలో యువ హీరో నందు పేరుని కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.

అయితే వెంటనే ఈ ఆరోపణల పై స్పందించిన నందు- తను అసలు ఇంతవరకు జీవితంలో డ్రగ్స్ ని చూడలేదని అలాగే తన పై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని ఒక న్యూస్ ఛానల్ కి వివరణ ఇచ్చాడు.

దయచేసి నిజాలు మాత్రమే బయటకి తేవాలని నందు మీడియాకి విజ్ఞప్తి చేశాడు. దీనితో ఆయన డ్రగ్స్ కేసులో ఉన్నాడంటూ జరిగిన ప్రచారానికి తెరపడినట్టయింది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS