కత్తిలాంటి అందాల 'నిధి'

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మలు తమ శరీరాన్ని నాజూగ్గా ఉంచుకొని తీరాల్సిందే. ఏమాత్రం కాస్త ఒళ్లు చేసినా వారికి అవకాశాలు చేజారిపోతుంటాయి. అందుకే పాపం అందాల భామలు తమ శరీరాన్ని అందమైన ఆకృతిలో ఉంచేందుకు ఎప్పటికప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటూంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ అదే చేస్తోంది. జిమ్‌లో తెగ కష్టపడిపోతూ, వర్కవుట్స్‌ చేసేస్తోంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? అందాల నిధి అగర్వాల్‌. 

అక్కినేని బుల్లోడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాతోనే తెలుగులోకి తెరంగేట్రం చేస్తోందీ బ్యూటీ. అయితే ఇంకా సినిమా విడుదల కాలేదు. షూటింగ్‌ చాలా బాగా వస్తోంది. తొలి సినిమాకే అమ్మడు తన యాక్టింగ్‌ టాలెంట్‌ చూపిస్తోందంటూ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారమ్‌. అలాగే అందంలోనూ ఈ ముద్దుగుమ్మ రత్నాలు పొదిగిన నిధే. ఆకట్టుకునే ఆకృతి ఈ ముద్దుగుమ్మ సొంతం. అయితే ఎందుకో కానీ తెగ వర్కవుట్స్‌ చేసేస్తోంది. ఆ వీడియోని ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఈ అందాల నిధి అగర్వాల్‌ వర్కవుట్స్‌ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అయ్యింది. అయితే ఈ వర్కవుట్స్‌ వెనకాల ఓ పెద్ద స్టోరీనే ఉందంటోందీ ముద్దుగుమ్మ. అదేంటో త్వరలో చెబుతానంటోంది. ఒకవేళ ఈ ముద్దుగుమ్మకి ఓ క్రేజీ ఆఫర్‌ ఏమైనా తగిలిందో ఏమో అంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీనియర్‌ నటి భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS