టాప్ హీరోని అవమానించిన నిత్యా మీనన్

మరిన్ని వార్తలు

నిత్యా మీనన్- ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది మంచి నటి, గాయని. అలాగే తనకి కథ నచ్చకపోతే ఎంతటి మంచి ఆఫర్ అయినా వదిలేసుకునే హీరోయిన్.

ఇక తాజాగా ఇలాంటి సంఘటననే జరిగినట్టు తెలిసింది. తెలుస్తున్న వివరాల ప్రకారం, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక పాత్ర కోసం నిత్యా మీనన్ ని సంప్రదించారట. అయితే ఆమె అందుకు నిరాకరించినట్టుగా సమాచారం. ఆమె ఎందుకు చేయడానికి విముఖత చూపించలేదు అన్న దానికి  కారణాలు తెలియనప్పటికీ ఈ వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి అందరూ ఆరాటపడుతుంటారు అలాంటిది ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించడంతో ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇక ఆమె ప్రస్తుతం ‘అ’ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈమె పాత్ర ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు.

ఏదేమైనా... తనకి నచ్చకపోతే ఎంతటి పెద్ద ఆఫర్ అయినా సరే వదిలేయడానికి వెనకాడదు అని మరోసారి నిరూపించింది నిత్యా మీనన్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS