జానీ మాస్టర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవన్..!

మరిన్ని వార్తలు

ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రాణమో, ఎంత ఇష్టమో అన్నది మనకు తెలిసిన విషయమే. ఇక అటువంటిది తను ఆ స్థాయిలో ఆరాధించే వ్యక్తే తిరిగి బహుమతి ఇస్తుంటే అతని ఆనందానికి హద్దులుంటాయా.

వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా కెరీర్ నుండి బ్రేక్ తీసుకుంటున్నా తన ఆర్ధిక అవసరాల నిమిత్తం నిర్మాతగా మాత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని కొనసాగించనున్నాడు. ఇప్పటికే నితిన్ హీరోగా ఒక చిత్రం నిర్మాణ దశలో ఉండగా, మరొక చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాడట.

ఆ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని జానీ మాస్టర్ కి ఇవ్వనున్నాడట పవన్. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలి అన్న కోరికతోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వచ్చిన జానీకి ఇలా ఆయన అమితంగా ఆరాధించే పవన్ నిర్మాణ సంస్థలోనే పనిచేయడం గొప్ప అదృష్టం.

అయితే ఈ చిత్రంలో హీరోగా మాత్రం వేరే వారు ఉంటారు పవన్ కళ్యాణ్ కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటారు అని తెలుస్తున్నది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS