తన అయుదు సంవత్సరాల కృషికి ఎల్లుండి ఫలితం దక్కనున్న ఈ తరుణంలో దర్శకుడు రాజమౌళి తన మనసులోని భావాలను అందరితో పంచుకున్నాడు.
ఎల్లుండి రిలీజ్ కి సంబంధించి టెన్షన్ ఓ పక్క ఉన్న, అదే సమయంలో తమ టీం పడిన కృషికి ఇంతటి గుర్తింపు వస్తుండడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. ఇక విషయానికి వస్తే, బాహుబలి తరువాత ఏంటి అన్న ప్రశ్నకి ఆయన అందరు ఒక రెండు నెలలు ఆగాల్సిందే అని చెప్పేశాడు.
ఈ రిలీజ్ తరువాత వెంటనే ఆయన తన కుటుంబంతో సహా భూటాన్ వెల్లనున్నరాట. ఇక ఆ తరువాతనే సినిమా గురించి ఆలోచిస్తానని, అంతవరకు అందరు వేచి చూడాలి అని విజ్ఞప్తి చేశారు.