ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే 'జయ జానకి నాయక' సినిమాతో మన ముందుకు రానుంది. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్యూట్ అండ్ యాక్షన్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. రొమాంటిక్ టచ్‌తోనూ, యాక్షన్ టచ్‌తోనూ ఉన్న టీజర్స్ ఇప్పటికే విడుదలయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో ఎక్కువగా ఏడుస్తూనే ఉంటుందట. ఎందుకలా? అన్నది తెరపైనే చూడాలట. భావోద్వేగాలు కలగలిసిన పాత్ర రకుల్ ప్రీత్ సింగ్‌ది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పాత్ర చేయలేదంటోంది. అందుకే చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుందట రకుల్ ఈ క్యారెక్టర్‌ని. కళ్ళలో గ్లిజరిన్ వేసుకుంటూ ఏడుస్తూనే ఉండేదట. అలా రోజంతా ఏడుస్తూ ఉండడంతో పాపం రకుల్‌కి సాయంత్రానికి కళ్లు వాచిపోయేవట. సినిమా తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మర్చిపోగలనని చెబుతోంది రకుల్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా తనలోని మరో డిఫరెంట్ యాంగిల్‌ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. 'సరైనోడు' సినిమాతో హిట్ అందుకున్నాడు బోయపాటి శీను. అలాగే రకుల్ క్యారెక్టర్ ఆ సినిమాలో కూడా కొంచెం భావోద్వేగాలతో కూడుకున్నదే. దానికి ఎక్స్‌టెన్షన్ ఈ సినిమాలోని రకుల్ పాత్ర అని అంటున్నారు. ఏమో సినిమా విడుదలైతే చూడాలి. మరో పక్క సూపర్ స్టార్ మహేష్‌తో 'స్పైడర్' సినిమాలోనూ నటిస్తోంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.