'దర్శకుడు' తొలి టికెట్‌ కొన్న మెగాస్టార్‌

మరిన్ని వార్తలు

హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'దర్శకుడు'. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మెగా పబ్లిసిటీ బాగా తోడయ్యింది. ఆడియో ఫంక్షన్‌కి రామ్‌ చరణ్‌ గెస్ట్‌గా హాజరు కాగా, ఈ సినిమా తొలి టికెట్‌ని ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి కొనడం గొప్ప విశేషం. అంటే 'దర్శకుడు' సినిమాకి మెగాస్టార్‌ తొలి ప్రేక్షకుడన్న మాట. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకి తొలి ప్రేక్షకుడు కావాలనీ ప్రతీ ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి ప్రేక్షకుల లిస్ట్‌లో ఉన్నవాళ్లలో ఈ సినిమా దర్శకుడు జక్కా, సుకుమార్‌ కూడా ఉండడం విశేషం. ఆలాంటిది తమ సినిమాకి మెగాస్టార్‌ తొలి ప్రేక్షకుడు కావడం చాలా సంతోషంగా ఉందని ఈ ఇద్దరితో పాటు, చిత్ర యూనిట్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ఆగష్టు 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మెగా ప్రశంసలు అందుకుంది. సుకుమార్‌ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోందంటనే ఈ సినిమాలో ఆయనకి సంబంధించిన విషయం ఏదో కనెక్ట్‌ అయి ఉంటుందనీ చిరంజీవి అన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అశోక్‌కి కూడా మెగా ప్రశంస దక్కింది. మంచి హీరో మెటీరియల్‌ అని చిరంజీవి అశోక్‌ని ప్రశంసించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిరంజీవి తన బెస్ట్‌ విషెస్‌ అందించారు. మరోపక్క సుకుమర్‌ దర్శకత్వంలో మెగా తనయుడు రామ్‌ చరణ్‌ 'రంగస్థలమ్‌' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిన విషయమే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS