వివాదంలో చిక్కుకున్న వర్మ ‘GST’

మరిన్ని వార్తలు

వివాదం, వర్మ అనేవి రెండు జంట పదాలుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే, ఆర్జీవీకి వివాదాలకి అంత దగ్గరి సంబంధం ఉంటుంది. ఇక తాజా వివాదం విషయానికి వస్తే, ఆయన నుండి ఈమధ్యనే భయటకి వచ్చిన GOD, SEX & TRUTH అనే అడల్ట్ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తున్నది. 

ఈ సమయంలోనే ఈ కాన్సెప్ట్ తనది అంటూ జయకుమార్ అనే యువ రచయత బయటకి వచ్చాడు. తాను గతంలో ఆర్జీవీని కలిసి ఈ కాన్సెప్ట్ ని వివరించినట్టు తెలిపాడు. ఇక ఈ కథ కాపీరైట్స్ విషయమై తాను న్యాయస్థానాన్ని సంప్రదించనున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇవ్వన్ని పక్కకి పెడితే, ఆర్జీవీ దర్శకత్వం వహించిన సర్కార్ 3 చిత్రానికి కథా రచయతగా జయకుమార్ పనిచేయడం విశేషం. 

అయితే ఈ అంశం పైన దర్శకుడు ఆర్జీవీ స్పందించాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ GST వీడియో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం పలువురు ఈ ట్రైలర్ పైన తమ అభిప్రాయాలని కూడా చెబుతుండడంతో ఆర్జీవీ చాలా సంతోషంగా ఉన్నాడు. మహేష్ కత్తి కూడా ఈ వీడియో పైన పాజిటివ్ గా స్పందించడం, దానికి ఆర్జీవీ కృతజ్ఞతలు తెలపడం కూడా జరిగిపోయాయి. 

ఇక ఈ GST ఫుల్ వీడియో ఈ నెల 26న మియా మల్కొవా విమియో ఎకౌంటు ద్వారా విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS