ప్రముఖ టీవీ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుతున్న వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని పుప్పాల్ గూడ మల్కాపూర్ టౌన్ షిప్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాధమిక సమాచారం బట్టి కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగానే ప్రదీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.
ఇక ప్రదీప్ కి ఈ మధ్యనే టెలివిజన్ లో నటిగా చేస్తున్న పావనిరెడ్డితో వివాహం జరిగింది. ఆమె కూడా ప్రదీప్ లాగానే టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనిఆధారాలు సేకరిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అందరికి బాధ కలిగిస్తున్నది.