భళా తందనాన మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : శ్రీ విష్ణు, క్యాథరిన్, గరుడ రామ్ తదితరులు 
దర్శకత్వం :  చైతన్య దంతులూరి
నిర్మాత‌లు : రజిని కొర్రపాటి 
సంగీతం : మని శర్మ
సినిమాటోగ్రఫర్ : సురేష్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్


రేటింగ్: 2/5


శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కంటెంట్ వుంటుందనే నమ్మకం. కమర్షియల్ హంగులు లెక్కలు వేసుకోకుండా మంచి కథని చూపించాలనే తపన శ్రీవిష్ణుది. బాణం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు చైతన్య దంతులూరిది కూడా ఇదే స్టయిల్. చేసిన రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ భళ తందనాన కోసం కల్సిశారు. వారాహి చలన చిత్రమ్ ఈ సినిమాని నిర్మించడం మరింత ఆసక్తిని పెంచింది. మరి టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమా భళా అనిపించిందా లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ


శ‌శిరేఖ (కేథ‌రిన్‌) ఇన్వెస్టిగేటివ్ జ‌ర్నలిస్ట్. చంద్రశేఖ‌ర్ (శ్రీవిష్ణు) ఓ అనాథాశ్రమంలో అకౌంటెంట్‌. అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని ఆ న్యూస్‌ కవర్‌ చేయడానికి అక్కడికి వెళ్తుంది శశిరేఖ. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ  చంద్రశేఖర్‌ తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హ‌త్యకి గుర‌వుతున్న వ్యక్తుల్ని తాను చూశాన‌ని కూడా  చెబుతాడు చంద్రశేఖ‌ర్. ఆ హత్యల్ని ప‌రిశోధించే క్రమంలో శ‌శిరేఖ‌కి ఎలాంటి విష‌యాలు తెలిశాయి?  రూ.2 వేల కోట్ల హవాలా డబ్బుకి చంద్రశేఖ‌ర్ కి వున్న సంబంధం ఏమిటి ? ఇలాంటి అంశాలన్నీ తెరపై చూడాలి


విశ్లేషణ: 


దర్శకుడిగా చైతన్యకి మొదట్లోనే మంచి మార్కులు పడ్డాయి. ఐతే అతను తీసిన రెండు సినిమాలు కమర్షియల్ విజయాలు కాలేదు. దీంతో చాల గ్యాప్ తర్వాత భళా తందనాతో అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించాలని ప్రయత్నం చేశాడు. దిని కోసం మంచి పాయింట్ నే ఎంచుకున్నాడు.    క్రైమ్‌ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్‌  చేయాలనే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ క్రమంలో చైతన్య లెక్క తప్పింది. పాయింట్ బావున్నా .. ఆ పాయింట్ కి చైతన్య ఇచ్చిన ట్రీట్ మెంట్ నప్పలేదు.


మంచి ఆరంభంతో ఆసక్తికరంగా కథని మొదలుపెట్టిన దర్శకుడు.. తర్వాత అక్కడే ఆగిపోయాడు. ఇంటర్వెల్ వరకూ కథని ముందుకు నడిపించలేదు. ప్రేమ., కామెడీ,  పాటలతో టైం పాస్ చేశాడు.  హీరో చెప్పే లవ్ స్టొరీలో కొన్ని నవ్వులు వున్నాయి కానీ కథని ముందుకు నడిపే వ్యవహారం కాకపోవడంతో అది సైడ్ ట్రాక్ గానే వుండిపోతుంది. వరసు హత్యలు జరిగిన తర్వాత కథ ఇంటర్వెల్ కి చేరుకుంటుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచడంలో దర్శకుడు సఫలమయ్యాడు.


సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని మలుపులు ఆసక్తికరంగా వుంటాయి. అయితే చాలా చోట్ల సాగదీత వ్యవహారం అనిపిస్తుంది. క్రైమ్ కామెడీలకు చాలా వచ్చాయి. ఐతే ఈ కథ వరకూ దర్శకుడు రాసుకున్న క్రైమ్ కామెడీ అంత కిక్ ఇవ్వకపోగా కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది. శ్రీవిష్ణు, చైతన్య  కమర్షియల్ లెక్కలు లేనివారే. ఐతే ఇందులో కొన్ని కొలతలు ఫాలోయ్యారు. లవ్ ట్రాక్, పాటలు ఆ కథకు అడ్డుతగిలాయి. క్లైమాక్స్ ని కొత్త డిజైన్ చేసినప్పటికీ అప్పటికీ .. కథని మరో లెవల్ కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడలేదు.


నటీనటులు :  


శ్రీవిష్ణు కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అమాయకమైన చంద్రశేఖర్ పాత్రలో  ఒదిగిపోయారడు. చందూ పాత్రలో మరో కోణం కూడా ఆకట్టుకుంటుంది. కేథరిన్ నటన బావుంది కానీ డబ్బింగ్ కుదరలేదు. తెలుగుని ఇంగ్లీష్ లా మాట్లాడుతుందని సినిమాలోనే సెటైర్ వేశారు. రామచంద్రరాజు పోసాని పాత్రలు మెప్పిస్తాయి. మిగతా నటులు పరిధి మేర చేశారు.


టెక్నికల్ గా : 


సాంకేతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ నేపధ్య సంగీతం బావుంది. పాటల్లో మణి మెరుపులు లేవు. కెమరాపని తనం ఓకే. కథకు  కావాల్సింది సమకూర్చారు నిర్మాతలు.


ప్లస్ పాయింట్స్


కొత్త పాయింట్
కథలో మలుపులు
క్లైమాక్స్


మైనస్ పాయింట్స్


సాగదీత స్క్రీన్ ప్లే
కథలో ఎమోషన్ మిస్ కావడం
 

ఫైనల్ వర్దిక్ట్ : 'భళా' అనిపించలేదు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS