'చిత్రలహరి' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: సాయిధరమ్ తేజ, కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పేతురాజ్ తదితరులు. 
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి 
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ 
విడుదల తేదీ: ఏప్రిల్ 12, 2019

రేటింగ్: 3/ 5

వరుసగా ఆరు ఫ్లాపులు సాయి ధరంతేజ్ కెరియర్ తో ఆడుకున్నాయి. తనలో కావల్సినంత ప్రతిభ వుంది. కానీ అదృష్టమే కలసిరావడం లేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకే కాస్త సమయం తీసుకుని మళ్ళీ రంగంలోకి దిగాడు. ఓ సినిమా విజయం యువత చేతుల్లోనే వుంది కాబట్టి.. వాళ్ళకు నచ్చే కధాంశం ఎంచుకున్నాడు. యూత్ సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ని దర్శకుడిగా ఎంచుకున్నాడు. అదే... 'చిత్రలహరి'. మరి ఈ ప్రయత్నం అయినా సాయి ని పరాజయాల ఊబిలోంచి బయటకి తీసుకో చ్చిండా లేదా? 'చిత్రలహరి' ఎలా వుంది?

* క‌థ‌

విజయ్ (సాయి ధరంతేజ్)...కి పేరు లో తప్ప నిజజీవితం లో విజయం వుండదు. చిన్నప్పటి నుంచి అన్నిట్లోనూ ఓడిపోతుంటాడు. అటు కెరియర్ లోనూ, ఇటు వ్యక్తిగత జీవితం లోనూ నిరాశలే ఎదురవుతూ వుంటాయి. తన జీవితం లోకి విజయం ఎప్పటికైనా వస్తుందిలే అనే ఆశతో బతికేస్తుంటాడు. లహరి (కల్యాణి ప్రియదర్సి) రాకతో విజయ్ లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇద్దరూ ప్రేమలో పడతారు. స్వేచ (నివేద పేతురాజ్)  వల్ల వీరిద్దరి ప్రేమకూ ఆటంకం కలుగుతుంది. లహరి విజయ్ కి దూరం అవుతుంది. అలా ప్రేమలోనూ ఫెయిల్ అవుతాడు విజయ్. ఇన్ని పరాజయాలలోంచి విజయ్ ఎలా బయటకి వచ్చాడు. గెలుపు తీరం ఎలా చేరాడు? అనేదే చిత్రలహరి కధాంశం.

* న‌టీన‌టులు

సాయి కెరియర్ లోనే కొత్త తరహా పాత్ర ఇది. ఎప్పుడూ హుషారు గా కనిపించే సాయి.. ఈ సారి ఓ పరాజితుడిగా దర్సనమిచ్చాడు. తన నటన, ఎమోషన్స్, ఇవన్నీ ఆకట్టుకుంటాయి. విజయ్ పాత్రకు తను నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశాడు. నటుడిగా ఈ సినిమాతో తను గెలిచినట్టే. అయితే తనదైన మార్క్ డాన్సులు చూసే అవకాశం దక్కలేదు. కల్యాణి, నివేదా లు లుక్ పరంగా ఆకట్టుకుంటారు. కల్యాణి నటన బాగుంది. అయితే డబ్బింగ్ సరిగా కుదరలేదు. నివేదా కు ఛాన్స్ తక్కువ. సునీల్ కొన్ని చోట్ల నవ్వించాడు. వెన్నెల కిషోర్, పోసాని.. ఎప్పటిలా మెప్పించారు.

* సాంకేతిక వ‌ర్గం

దర్శకుడిగా కంటే రచయితగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల. ఇదో మామూలు కధ. కానీ ఆ కధని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ సంభాషణలు ఆకట్టుకున్నాయి. అయితే స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. దేవిశ్రీ పాటలు సందర్భానికి తగ్గట్టు సాగాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

* విశ్లేషణ‌

ఓ పరాజితుడి కధ ఇది. విజయ్ లాంటి కుర్రాళ్ళు నిజజీవితం లోనూ తారసపడుతుంటారు. అంతెందుకు.. మన ఇంట్లోనో, మన పక్కింటి లోనో వుండే వుంటారు. అలాంటి యువతరం ఈ కధకు, విజయ్ పాత్రకు తప్పకుండా కనెక్ట్ అయిపోతారు. ఈ కధ ని మొదలుపెట్టిన విధానం, పాత్రలని పరిచయం చేసిన పద్దతి, ప్రారంభ సన్నివేశాలు చూస్తుంటే... యువతరానికి నచ్చేలా ఈ సినిమా రూపొందించారు అనే నమ్మకం కలుగుతుంది. సునీల్ పాత్ర అక్కడక్కడ నవ్వులు పంచిస్తూ .. సాయి ధరం అక్కడక్కడ మన ఎమోషన్ ని టచ్ చేస్తూ... దేవి శ్రీ పాటలు హుషారు పంచుతూ.. మాటలు మెలి తిప్పుతూ.. తొలి భాగం లో కంప్లైంట్స్ ఇవ్వడానికి పెద్దగా ఆస్కారమే లేకుండా చేశాడు. ఇలాంటి కధలు ఫస్ట్ ఆఫ్ వరకూ డీల్ చేయడం సులభమే. అసలు శ్రమంతా ద్వేతియార్ధం లోనే కనిపిస్తుంది. అక్కడ కూడా తొలి సగం లో చేసిన మేజిక్ పనిచేస్తే.. తేజూ కి ఆరు ఫ్లాపుల తరవాత ఓ సూపర్ హిట్ పడిపోదును.

కానీ ఇక్కడ దర్శకుడు కిషోర్ తిరుమల కాస్త నెమ్మదించాడు. యువత కోసం ఓ కధ చెబుతున్నప్పుడు, వాళ్ళకి నచ్చే వేగం కధనం లో ఉండేలా జాగ్రత్త పడాలి. నేరేషన్ వేగంగా వుండాలి. కానీ అదేమీ జరగలేదు. సరికదా తొలిభాగం తో పోలిస్తే.. సినిమా మరింత నెమ్మదిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిది. అందులో కొత్త దానం లేకపోయినా కనెక్టివిటీ వుంది. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతున్నా.. ఈ కధని అలా తప్ప మరోలా ముగించడం కుదరదు కాబట్టి... ముగింపు కోసం ఓపికగా చూడొచ్చు. కానీ చెప్పిందే మళ్ళీ చెప్పి, చుపించిందే మళ్ళీ చూపించి కాస్త విసిగించాడు దర్శకుడు. ఇలాంటి సినిమాల్లో కనిపించాల్సిన బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇక్కడ మాత్రం మిస్ అయ్యింది. దాంతో దర్శకుడు చెప్పే విషయంలో బలం లేక, వాటిపై ప్రేక్షకుడు ఆసక్తి చూపించలేడు. తొలి సగం లో వున్న ఆ కాస్త ఎంటర్తైన్మెంట్ కూడా సెకండ్ ఆఫ్ లో మిస్ అవుతుంది. దాంతో ఆడియన్ కి ఆ కాస్త రిలీఫ్ కూడా దొరకదు. రొటీన్ క్లైమాక్స్ మరో బలహీనత.

* ప్ల‌స్ పాయింట్స్ 

+ తేజూ నటన
+ పాటలు 
+ డైలాగ్స్

* మైన‌స్ పాయింట్స్

- స్లో నేరేషన్
- కధలో సంఘర్షణ లేకపోవడం 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  విజయానికి అటూ ఇటూ

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS